సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి : డి.యాదగిరి

సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న

Update: 2024-12-18 08:53 GMT

దిశ,హిమాయత్‌నగర్‌ : సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఉద్యోగులందరినీ విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి, కోశాధికారి దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అప్పటి వరకు తక్షణమే ఉద్యోగ భద్రత తో కూడిన పే స్కేల్ ఇవ్వాలన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సుమారు 18 సం.ల నుండి 19,600 మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్య యొక్క మెరుగు కోసం కృషి చేస్తున్నామని అన్నారు.

తమ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య భీమా రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలని అన్నారు. ఉద్యోగులకు పదవీ విరమణ చేస్తున్న వారికి, చేసిన వారికి బెనిఫిట్స్ కింది 25 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ, విద్యాశాఖ నియమకాలలో వెయిటేజ్ కల్పించాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికి రీ-ఎంగేజ్ విధానాన్ని తీసేయాలన్నారు.

వరంగల్ లో 2023 ఆగస్టు, సెప్టెంబర్ లో దాదాపు 25 రోజుల సమ్మె చేసిన క్రమంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మా ధర్నా పాయింట్ వద్దకు వచ్చి సమ్మెకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సచివాలయానికి పిలిచి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి పడాల రవీందర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సురేందర్ సహదేవ్, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జానకి, చందు, రమేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సరిత తదితరులు పాల్గొన్నారు.


Similar News