విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ గా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే కూనంనేని

ఇందిరా పార్క్,ధర్నా చౌక్ వద్ద బుధవారం విద్యుత్‌

Update: 2024-12-18 13:20 GMT

దిశ,రాంనగర్ : ఇందిరా పార్క్,ధర్నా చౌక్ వద్ద బుధవారం విద్యుత్‌ ఆర్టిజన్స్‌ కన్వర్షన్‌ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆర్టిజన్‌ ఉద్యోగుల వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ ధర్నాకు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ గా పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కార్మికుల నాయకుడిగా గెలిచిన ఎమ్మెల్యేగా సంబంధిత ఎంతో మందికి కార్మికుల సమస్యల పట్ల ఉత్తరాలు రాసి పంపిస్తున్నాను అన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా, కార్మిక నాయకుడిగా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

విద్యుత్ సమస్య వచ్చినప్పుడు గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మాట్లాడినాను. వచ్చే బడ్జెట్ సమావేశంలో తన వంతుగా కార్మికుల పక్షాన మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వెన్షన్ చైర్మన్ సీఐటీయు కే ఈశ్వరరావు కన్వీనర్ ఎంఏ వజీర్, కో చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News