బీజేవైఎం కార్యకర్తలపై విరిగిన లాఠీలు

రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని బీజేవైఎం నేతలు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

Update: 2024-07-04 15:29 GMT

దిశ, కార్వాన్ : రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని బీజేవైఎం నేతలు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యాలను నిరసిస్తూ బీజేవైఎం నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం నుంచి శవయాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరింది. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు బీజేవైఎం

     నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జి చేశారు. హిందువులపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలు అయిందని బీజేవైఎం నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం, క్రైస్తవు లకు చెందిందని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. భారతీయులు కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలని కోరారు. ఆందోళన బీజేపీ కార్యాలయం ఎదుట మాత్రమే చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. 


Similar News