హైదరాబాద్ వాసుల చొరవ ఎప్పటికీ మర్చిపోలేను...ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

తనను జైల్లో పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ వాసులు ఆందోళనలు వ్యక్తం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు...

Update: 2024-07-07 08:00 GMT

దిశ, వెబ్ డెస్క్: తనను జైల్లో పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ వాసులు ఆందోళనలు వ్యక్తం చేశారని, ఎప్పటికీ మర్చిపోలేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభను టీవీలో చూసి గర్వించానని ఆయన చెప్పారు. భాగ్యనగరంలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని చెప్పారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా కార్యకర్తలు మాత్రం పార్టీని వదల్లేదన్నారు. నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారని, కానీ కార్యకర్తలు మాత్రం ఉండిపోయారని చంద్రబాబు తెలిపారు.

తెలుగు జాతి ఉన్నంత వరకూ రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని చంద్రబాబు చెప్పారు. సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకుని ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని దక్కించుకున్నామన్నారు. తనను జైల్లో ఉంచిన సమయంలో టీడీపీ శ్రేణులు చాలా చొరవ చూపారని, తాను ఎప్పటికీ మర్చిపోనన్నారు. తన అరెస్ట్‌ను నిరసిస్తూ చాలా దేశాల్లో ఆందోళనలు నిర్వహించారని చంద్రబాబు గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకనామికి హైదరాబాద్‌లో నాంది పలికాం. ఆ తర్వాత అభివృద్ధిని కాంగ్రెస్, బీఆర్ఎస్ కొనసాగించాయి. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారు.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News