High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బెయిల్ పిటిషన్లు వాయిదా

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) నిందితుల బెయిల్ పిటిషన్ల(Bail Petitions) పై విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా(Adjourned) వేసింది.

Update: 2024-11-18 12:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) నిందితుల బెయిల్ పిటిషన్ల(Bail Petitions) పై విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా(Adjourned) వేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రాధాకిషన్ రావు(Radhakishan Rao), భుజంగరావు(Bhujangara Rao) కీలక నిందితులుగా ఉన్నారు. వీరి బెయిల్ గడువు ముగియడంతో మరోసారి బెయిల్ కోరుతూ విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ వీరి బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ ను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయగా.. భుజంగరావు పిటిషన్ ను ఈ నెల 28న విచారించాలని నిర్ణయించింది. కాగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవలే పలువురు బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యేల(Former MLAs)కు కూడా నోటీసులు అందాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో ఎంతటి వారున్న వదిలేది లేదని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News