Lagacharla incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిపై ప్రభుత్వం వేటు
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన(Lagacharla incident)పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన(Lagacharla incident)పై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పరిగి డీఎస్పీ కరుణాకర్ రెడ్డి(DSP Karunasagar Reddy)పై వేటు వేసింది. ఆయన్ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను నియమించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad Collector)తో పాటు అధికారులపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలో తమపై పోలీసులు, ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని లగచర్ల గిరిజన కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి.