BREAKING: ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణం.. ఆ కాలేజీని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు

నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది.

Update: 2024-09-03 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఆ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే నిజాంపేట హిల్ కౌంటి ఎదురుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పత్తికుంట చెరువులోకి గత రెండు రోజులుగా ఎడతెరిపి కలేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. అయితే, అందులో 4 ఎకరాలు ఆక్రమించి కొందరు ఎస్‌ఆర్‌ రెసిడెన్షియల్‌ క్యాంపస్‌ పేరుతో కళాశాలను రన్ చేస్తున్నట్లుగా ‘హైడ్రా’కు సమాచారం అందింది. పక్కా అధారాలతో మంగళవారం మధ్యాహ్నం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కళాశాలకు తాళం వేసి సీజ్ వేశారు. కాగా, వరదల కారణంగా ఎస్‌ఆర్‌ కాళాశాల సెల్లార్‌లోకి వరద నీరు చేరడంతో సమారు 500 మంది విద్యార్థులను యాజమాన్యం వాళ్లను తిరగి ఇళ్లకు పంపించింది.


Similar News