Hyderabad : 25 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు బెయిల్
25 మంది యూత్ కాంగ్రెస్(Youth Congress) నేతలకు నాంపల్లి కోర్ట్ బెయిల్(Bail) మంజూరు చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : 25 మంది యూత్ కాంగ్రెస్(Youth Congress) నేతలకు నాంపల్లి కోర్ట్ బెయిల్(Bail) మంజూరు చేసింది. ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మంగళవారం పలువురు యూత్ కాంగ్రెస్ లీడర్లు నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ ఆఫీసుపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు యూత్ లీడర్స్ తెలంగాణ భవన్ వద్ద గొడవకు సిద్ధ పడగా.. పోలీసులు జోక్యం చేసుకొని ఆపారు. కాగా ఈ సమయంలో యూత్ కాంగ్రెస్ నేతలు విధుల్లో ఉన్న సీఐపై చేసుకున్నారంటూ.. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్ట్.. వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.