Allu Aravind : కిమ్స్ ఆసుపత్రికి అల్లు అరవింద్

సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ(SriTeja)ను సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో నేడు పరామర్శించారు.

Update: 2024-12-18 11:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో(Pushpa-2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ(SriTeja)ను సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) కిమ్స్ ఆసుపత్రి(KIMS Hospital)లో నేడు పరామర్శించారు. బాలుడి కుటుంబ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్(Allu Arjun) రాలేక పోయారని, అర్జున్ తరపున తాను వచ్చానని తెలిపారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అల్లు అరవింద్ పేర్కొన్నారు. కాగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మంగళవారం రాత్రి కిమ్స్ ఆసుపత్రి వైద్యలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 

Tags:    

Similar News