హెర్బల్ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు

హెర్బల్ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అన్నారు.

Update: 2023-08-22 12:59 GMT

దిశ, హైదరాబాద్: హెర్బల్ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అన్నారు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో సోమవారం యాక్టివ్ వెల్ నెస్ అండ్ న్యూట్రిషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఎంత పని ఒత్తిడి ఉన్నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. యాక్టివ్ వెల్ నెస్ అండ్ న్యూట్రిషన్ సెంటర్ ద్వారా హెర్బల్ ఉత్పత్తులను అందించి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి ప్రత్యేక కృషి చేస్తోన్న సెంటర్ నిర్వాహకులు సంధ్య అశోక్ కుమార్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఈ నేపథ్యంలో గెట్ టీం మెంబర్ అనంతసేనారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో వేగవంతమైన జీవితాల కారణంగా ఊబకాయ సమస్యలేర్పడుతున్నాయని.. దీంతో బీపీ, డయాబెటిస్, గుండెజబ్బు లాంటి వ్యాధులకు కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఊబకాయం, బీపీ, డయాబెటిస్ వ్యాధుల నివారణలో హెర్బల్ ఉత్పత్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని న్యూట్రిషన్ సెంటర్ నిర్వాహకులు తీగలపల్లి సంధ్య అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ మహేశ్వరం సతీష్ కుమార్, పూజిత, న్యూట్రిషన్ సెంటర్ నిర్వాహకులు తీగలపల్లి సంధ్య అశోక్ కుమార్, రామాచారి, రాధ, విజయ్ కుమార్ మరియు తీగలపల్లి శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చొల్లేటి రామలక్ష్మి, సొల్లేటి సోమనర్సయ్య, ఉపేంద్రాచారి, హర్షిణి, పోతుగంటి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


Similar News