దేవాలయాలపై వరుస దాడులు.. హైదరాబాద్ సీపీని కలిసిన VHP నాయకులు

హైదరాబాద్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.

Update: 2024-10-17 15:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వీహెచ్‌పీ నేతలతో కలిసి హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. హిందూ దేవాలయాల ధ్వంసం వెనుక దాగి ఉన్న కుట్రను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలతో నగరంలో అలజడి రేగితే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మసీదులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మసీదుల్లో నివసిస్తున్న విదేశీ చొరబాటుదారుల వల్లే నగరానికి ముప్పు పొంచి ఉందని వీహెచ్‌పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

దేవాలయల వద్ద నిఘా పెంచాలని డిమాండ్ చేశారు. దోషులను దొంగలుగా, పిచ్చి వారిగా ముద్రవేసి రక్షించొద్దని కమిషనర్‌కు సూచించారు. ఇతర ప్రాంతాలతో పాటు, ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తులను గుర్తించి తరిమేయాలన్నారు. సికింద్రాబాద్‌లోని కుమ్మరివాడ‌లోని మసీదు కూడా అక్రమంగా నిర్మించారని చెప్పారు. ఇదిలా ఉండగా తమ ఫిర్యాదుపై కమిషనర్ ఆనంద్ సానుకూలంగా స్పందించినట్లు బాలస్వామి చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ మూర్తి, నాయకులు రామరాజు, వెకటేశ్వరరాజు, శశిధర్, శివరాములు, కిశోర్, అనంత్, తిరుపతి ఉన్మారు.


Similar News