రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు
హిందూ పురాణాల్లో రామాయణంకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ విలువలు, సంబంధాల గురించి పాఠాలు నేర్పే రామాయణం.. విధేయత, త్యాగం, ప్రేమ, గౌరవం వంటి సద్గుణాలను హైలెట్ చేస్తుంది. కాగా రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన
దిశ, ఫీచర్స్ : హిందూ పురాణాల్లో రామాయణంకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబ విలువలు, సంబంధాల గురించి పాఠాలు నేర్పే రామాయణం.. విధేయత, త్యాగం, ప్రేమ, గౌరవం వంటి సద్గుణాలను హైలెట్ చేస్తుంది. కాగా రామాయణం నుంచి నేర్చుకోవాల్సిన కీలక సంబంధాల పాఠాలు కొన్ని తెలుసుకుందాం.
భక్తి, కర్తవ్యం, నమ్మకం
సీతారాములు ఆదర్శనీయులు. వివాహ బంధంలో నిబద్ధత ప్రేమకు మించినదని లోకానికి చాటి చెప్పారు. భాగస్వామ్య బాధ్యతలు, త్యాగాల గురించి వివరిస్తుంది. ఏదైనా బలమైన బంధానికి నమ్మకం పునాది. అందుకే సీతమ్మ పవిత్రమైనదని తెలిసే.. అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు.
సోదర ప్రేమ
రామ లక్ష్మణుల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తెలుపుతుంది. నిస్వార్థ ప్రేమ, విధేయత, ఒకరినొకరు బేషరతుగా మద్దతు ఇచ్చుకోవడం గురించి తెలుపుతుంది.
మంచి కోసం త్యాగం
సంబంధాల్లో నిజమైన ప్రేమ తరుచుగా వ్యక్తిగత కోరికల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. రాముడు, భరతుడి బంధం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.
స్నేహం, మద్దతు
నిజమైన స్నేహం అంటే విధేయత, మద్దతు, ఒకరికొకరు సహాయం చేయడం కంటే మించినది. రామ, ఆంజనేయుల బంధం ఇలాంటిదే.
నిర్లక్ష్యం పరిణామాలు
ప్రియమైన వారి నుంచి తెలివైన సలహాను విస్మరించడం నాశనానికి దారితీస్తుంది. విభీషణుడు.. రావణుడికి ఇచ్చిన సలహా పాటించకపోవడం వల్లే వినాశనానికి గురయ్యాడు.