మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమం వృథా అవుతుంది అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు.

Update: 2024-08-11 13:56 GMT

దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమం వృథా అవుతుంది అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం బంజారాహిల్స్, బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ మాదిగ సంఘాల సదస్సులో డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎస్సీ  ఏబీసీడీ వర్గీకరణ 1994 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు ఏడు శాతం ఉన్నారని, కానీ ప్రస్తుత 2014లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో మాదిగలు 12 శాతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని అన్నారు. కావున తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు న్యాయమైన 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. 12 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే  మూడు దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్న ఉద్యమానికి తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. 7 సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పునివ్వడం స్వాగతిస్తున్నామని,

    అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో మాదిగలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం లో 10 లక్షల మంది మదిగలతో హైదరాబాద్ నగరంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ , ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ , ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం , ఆరేపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ మాదిగ, డాక్టర్ చారకొండ వెంకటేష్, ప్రముఖ గాయకులు ఏపూరి సోమన్న, ఎమ్మార్పీఎస్ నాయకురాలు మేరీ మాదిగ, అంబేద్కర్ సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు రాపోలు రాములు , ప్రొఫెసర్ దయాకర్, ప్రొఫెసర్ ముత్తయ్య, ప్రొఫెసర్ పురుషోత్తం, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డ యాదయ్య, ఎన్డీఎస్ఎస్ ఉపాధ్యక్షులు బుదల బాబురావు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైస ఉపేందర్, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు నరసింహారావు, మాదిగ శక్తి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ సన్నీ, తెలంగాణ దళిత దండు రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూర బాలరాజు, డాక్టర్ బోల్లికొండ వీరేందర్, బోరెల్లి సురేష్, నక్క మహేష్, మోగులయ్య,దేవరకొండ నరేష్, జోగు గణేష్,తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News