HYD: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలు అరెస్ట్
నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ అయ్యాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ అయ్యాయి. వీరి నుంచి భారీగా డ్రగ్స్ ను పోలీసులు(Telangana Police) స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్(CV Anand IPS) తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్(Hyd City Police), హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(H-NEW) లు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 130 గ్రాముల ఎండీఎంఏ(MDMA), 10 ఎల్ఎస్‌డీ(LSD) బ్లాట్స్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, సీజ్ చెయ్యడం జరిగిందని అన్నారు.
అంతేగాక ఈ రెండు కేసుల్లో మాదకద్రవ్యాల సరఫరాదారులు, పెడ్లర్లు డ్రగ్స్ వినియోగించే వారి నుండి మ్యూల్ ఖాతాల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్నట్లు గుర్తించామని, వారిని వర్చువల్ నంబర్ల ద్వారా కమ్యూనికేట్ చేసేవారు తెలుసుకున్నామని అన్నారు. ఇక ఈ ముఠాలు పోలీసులకి దొరకకుండా ఉండేందుకు డెడ్ డ్రాప్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవారని తెలిపారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ విభాగం మరింత బలోపేతం కావడంతో రానున్న రోజుల్లో మాదకద్రవ్య ముఠాలు, వారి నెట్‌వర్కులపై మరిన్ని దాడులు జరగుతాయని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.