Chicken Price: మాంసం ప్రియులకు భారీ గుడ్ న్యూస్..
కొంత మంది ముక్క లేనిదే ముద్ద దిగదు అనుకునేవారు నిత్యం చికెన్ తెచ్చుకుంటుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది ముక్క లేనిదే ముద్ద దిగదు అనుకునేవారు నిత్యం చికెన్ తెచ్చుకుంటుంటారు. అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ వచ్చినా చాలా మంది ముందుగా చికెన్ తెచ్చి పెట్టాలనుకుంటారు. దీంతో కనీసం వారానికి మూడు, నాలుగు సార్లు అయినా తింటుంటారు. ఎక్కువమంది చికెన్‌కే మొదటి ప్రాధాన్యతను ఇస్తుంటారు. కానీ ఒకానొక సమయంలో కేజీ చికెన్ ధర రూ. 300 పైగానే ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ కావడంతో చికెన్ ధరలు ఊపందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాన్ వెజ్ ప్రియులకు భారీ గుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయని సమాచారం. దీంతో కేజీ విత్ స్కిన్ చికెన్ రూ. 150 ఉండగా స్కిన్‌లెస్ రూ. 170కి పడిపోయింది. ఒకవైపు చలి తీవ్రత పెరుగుతుండటంతో ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.