Home Guards: మా సమస్యలు పరిష్కరించాలి.. సీఎం విగ్రహంతో మాజీ హోంగార్డు దీక్ష

హోంగార్డుల(Home Guards) సమస్యలను(Problems) పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం(CM Revanth Reddy Statue)తో మాజీ హోంగార్డు(Former Home Guard) తన ఇంటి ఎదుటే నిరసన దీక్షకు దిగారు.

Update: 2024-11-29 09:40 GMT

దిశ, వెబ్ డెస్క్: హోంగార్డుల(Home Guards) సమస్యలను(Problems) పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం(CM Revanth Reddy Statue)తో మాజీ హోంగార్డు(Former Home Guard) తన ఇంటి ఎదుటే నిరసన దీక్షకు దిగారు. రాష్ట్ర హోంగార్డు జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ(Sakinala Lakshmi Narayana) గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో హోంగార్డుల సమస్యలపై నిరసన తెలిపినందుకు ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు.

ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వచ్చాక హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బెల్లంపల్లి(Bellampally) పట్టణంలోని తన నివాసం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసుకొని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చేనెల 6వ తేదిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భవ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంచనాలతో జరపాలని, హోంగార్డ్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక హోంగార్డు సర్వీస్ లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్సించాలని, రిటైర్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద ప్రోత్సాహకాలు ఇవ్వాలని, హోంగార్డుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని 65 సంవత్సరాలకు పెంచాలని పలు వినతులతో కూడిన పోస్టర్ ను ఏర్పాటు చేసి, నిరసన చేస్తున్నారు.

Tags:    

Similar News