High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్

హైడ్రా(Hydra)పై హైకోర్టు(High Court) మరోసారి సీరియస్ అయింది.

Update: 2025-02-20 16:32 GMT
High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(Hydra)పై హైకోర్టు(High Court) మరోసారి సీరియస్ అయింది. సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా అని, న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తారా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్‌ కే. లక్ష్మణ్‌ తీవ్రంగా స్పందించారు. మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదని, న్యాయస్థానం ఆదేశాలంటే ఎంటో తెలిసేలా చేస్తాం అంటూ హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్‌పెక్టర్‌ రాజశేఖర్‌ పైనా ధర్మాసనం మండిపడింది. పోలీస్‌ శాఖను నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదని హైకోర్టు తెలిపింది. చట్టపరంగా నడుచుకోవాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విచారణను వాయిదా వేశారు.

Tags:    

Similar News