Harsha Sai Case Update : షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ప్రముఖ యూట్యూబ‌ర్ హ‌ర్ష‌సాయికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-10-04 14:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ యూట్యూబ‌ర్ హ‌ర్ష‌సాయికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఒక సినిమా విష‌యంలో త‌న‌పై లైంగిక దాడి చేసినట్లు నగరంలోని నార్సింగి పోలీసుల‌ను ఆశ్రయించిన బాధిత యువ‌తి అత‌డిపై మ‌రో కేసు పెట్టగా… ఈ కేసుల్లో తనకు ముందస్తు (యాంటిస్పెటరీ బెయిల్) ఇవ్వాలని హైకోర్టును ఆయన ఆశ్రయించగా…అందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని నిరాకరించింది. ఈ మేరకు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ, హర్షసాయికి బెయిల్ ఇవ్వాలని కోర్టును విజ్ఒప్తి చేయగా, పిటిషన్ ను కొట్టివేసింది. సంబంధిత కేసులో నిందితులుగా హర్షసాయిని చేర్చకముందే ముందస్తు బెయిల్ ఎలా అడుగుతారని, తాము ఎలా మంజూరు చేస్తామని హైకోర్టు ప్రశ్నించింది.

కేసులో నిందితులుగా చేర్చిన తర్వాతనే ముందస్తు బెయిల్ కు ఇచ్చే అవకాశం ఉంటుందని, న్యాయస్థానం హర్షసాయి న్యాయవాదికి సూచించింది. బాధితురాలు తమ పిటిషనర్ తండ్రిపై తప్పుడు వివరాలతో కేసు పెట్టారని న్యాయస్థానంకు హర్షసాయి అడ్వకేట్ నివేదించారు. హర్ష సాయి, బాధితురాలకు పెళ్లి చేయాలని బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి హర్షసాయి తండ్రి రాధాకృష్ణనే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడన్న న్యాయవాది వివరించారు. అయితే, ఫిర్యాదులోమ మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తానని మోసం చేశాడని బాధితురాలు పేర్కొందని గుర్తు చేశారు. అయితే, ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హర్షసాయి పిటిషన్ ను లీగల్ గ్రౌండ్స్ చెల్లదని వ్యాఖ్యానిస్తూ… డిస్పోజ్(కొట్టివేయడం) చేసింది.


Similar News