హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం

హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది.

Update: 2024-10-11 13:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్‌నగర్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో వర్షం పడుతోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ నీటిని నాలాల్లోకి మళ్లించాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తమైంది.


Similar News