MP DK Aruna : అందరికీ వైద్యం.. అదే మోదీ లక్ష్యం : ఎంపీ డీకే అరుణ

అందరికి వైద్యం(Healthcare For All) ప్రధాని మోడీ(Prime Minister Modi) లక్ష్యమని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణ(MP DK Aruna)పేర్కొన్నారు.

Update: 2025-01-07 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : అందరికి వైద్యం(Healthcare For All) ప్రధాని మోడీ(Prime Minister Modi) లక్ష్యమని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణ(MP DK Aruna)పేర్కొన్నారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గంలో అమృత్ భారత్-2 స్కీమ్ కింద కొడంగల్ లో రూ.‌4.5 కోట్లు, కోస్గిలో 12.5 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మద్దూర్ మండలం పర్యటనలో భాగంగా జాదవరావుపల్లి, రేణివట్లలో కేంద్రం ప్రభుత్వ నిధులతో నిర్మించిన పల్లె దవాఖానాల(Village Hospitals)ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీ.కే.అరుణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతోనే ఈ పల్లె దవాఖానాలను నిర్మించిందన్నారు. డాక్టర్లు, ఇద్దరు ఎఎన్ఎంలు, ఆశ వర్కర్ లు, ఇతర సిబ్బందిని నియమించి ప్రజలకు తక్షణమే వైద్యం అందించబోతున్నామని తెలిపారు.

అత్యవసర వైద్యాన్ని కూడా అందించనున్నారన్నారు. మొత్తం 259 గ్రామ పంచాయతీలలో 59 పల్లె దవాఖానాలు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ దవాఖానాల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం, ఇతర లోపాలు గుర్తించి మందులు ఇస్తారని, పల్లె దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Tags:    

Similar News