'హాథ్‌సే హాథ్' జోడో యాత్రకు ముహుర్తం ఫిక్స్.. 50 సెగ్మెంట్లు కవర్ చేసేలా T- కాంగ్రెస్ ప్లాన్!
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రకు ఏఐసీసీ నుంచి గ్రీన్సిగ్నల్వచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హాథ్‌సే హాథ్‌జోడో యాత్రకు ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 6న ములుగు జిల్లా సమ్మక్క, సారక్క ఆలయం నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తోన్నది. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో పాటు, టెంపుల్‌ను పార్టీ సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది. అయితే తొలి విడత కేవలం 40 నుంచి 50 అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ ఆధ్వర్యంలో హాథ్‌సే హాథ్‌జోడో యాత్రను నిర్వహించనున్నారు.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు బెల్ట్‌కి ప్రయారిటీ ఇస్తూ ఈ యాత్ర కొనసాగుతుందని ఓ ముఖ్య లీడర్ తెలిపారు. అయితే రూట్ మ్యాప్‌ను రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. 60 రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రకు టీపీసీసీ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించింది. అయితే ప్రియాంక గాంధీ పాల్గొనే ఛాన్స్ఉన్నదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
మిగతా సెగ్మెంట్‌ల పరిస్థితి ఏమిటీ..?
కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అయితే హాథ్‌సే హాథ్ జోడో యాత్రను తొలి విడత కేవలం 50 నియోజకవర్గాలలోనే నిర్వహించాలని ఏఐసీసీ సూచించినట్లు టీపీసీసీ పేర్కొన్నది. ఈ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందోనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కానీ కాంగ్రెస్కేడర్ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ హాథ్‌సే హాథ్‌జోడో యాత్ర కొనసాగే ఛాన్స్కనిపిస్తున్నది. టీపీసీసీ మాత్రం తొలి విడత పూర్తయిన తర్వాత ఏఐసీసీ ముఖ్య లీడర్లతో చర్చించి మిగతా సెగ్మెంట్‌లపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీంతో మిగతా నియోజకవర్గాల్లోని కేడర్‌నుంచి అసంతృప్తి రాగం వినిపించే ఛాన్స్ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
''అదృష్టంగా భావిస్తున్నా: సీతక్క, ములుగు ఎమ్మెల్యే
హాథ్‌సే హాథ్‌జోడో యాత్ర ములుగు జిల్లా నుంచి ప్రారంభించాలని జాతీయ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించడాన్ని సంతోషిస్తున్నా. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పార్టీని అధికారం తెచ్చే ప్రక్రియ మేడారం నుంచి మొదలు కావడం ఆనందాన్ని కల్గిస్తుంది. ఈ హాథ్‌సే హాథ్‌జోడో యాత్రలో ప్రతి గడపను టచ్‌చేస్తూ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తాం. సమ్మక్క, సారక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాబోతుందని విశ్వసిస్తున్నాం.''
Also Read...
ప్రజల్లోకి ''బడ్జెట్''.. ప్రతి గడపకు రీచ్ అయ్యేలా దేశవ్యాప్తంగా BJP స్పెషల్ డ్రైవ్!