Director Sukumar : కిమ్స్ ఆసుపత్రికి దర్శకుడు సుకుమార్

సంధ్య థియేటర్ (Sandhya Theatre)లో పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో(Pushpa 2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sri Teja)ని దర్శకుడు సుకుమార్(Director Sukumar)పరామర్శించారు.

Update: 2024-12-19 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ (Sandhya Theatre)లో పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో(Pushpa 2 Premiere Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sri Teja)ని దర్శకుడు సుకుమార్(Director Sukumar)పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి అతని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బాలుడి కుటుంబానికి సుకుమార్ భార్య తబిత బండ్రెడ్డి డిసెంబర్ 9వ తేదీన శ్రీతేజ్ వైద్యం కోసం అతని తండ్రికి రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.

కాగా ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సైతం కిమ్స్ కు వెళ్లి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అల్లు అర్జున్ పై కోర్టులో కేసు కొనసాగుతున్నందనా ఆయన రాలేకపోవడంతో తాను ఆసుపత్రికి రావడం జరిగిందని అల్లు అరవింద్ తెలిపారు. కాగా ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా సమాచారం. 

Tags:    

Similar News