TG High Court: హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు BIG షాక్
హైకోర్టు(Telangana High Court)లో నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు(Telangana High Court)లో నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టు(Journalist)పై దాడి కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు(High Court) నిరాకరించింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. మోహన్ బాబుపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నోటీస్ ఇచ్చామని.. ఈ నెల 24వ తేదీ వరకు సమయం అడిగారని తెలిపారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని రాచకొండ సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.