Nidhi Agarwal : అది లీక్డ్ ఫొటో కాదు.. వైరల్ పిక్‌పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab) చిత్రంతో బిజీగా ఉంది.

Update: 2024-12-19 09:53 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ప్రజెంట్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab) చిత్రంతో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruti) కాంబోలో వస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్‌తో పాటు మాళవికా మోహనన్ (Malavika Mohanan) కూడా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. ‘ది రాజాసాబ్’ నుచి నిధి అగర్వాల్ లుక్ లీక్ అయిందంటూ ప్రజెంట్ ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో తాజాగా ఈ వార్తలసై హీరోయిన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

ఈ మేరకు తన సోషల్ మీడియా (Social Media) అకౌంట్ X ద్వారా తెలియజేస్తూ.. ‘హాయ్ ఫామిలీ! ఇది ‘ది రాజాసాబ్’ సినిమా నుండి లీక్ అయిన ఫోటో కాదు.. నేను చేసిన యాడ్ షూట్ నుండి వచ్చిన ఫొటో ఇది.. వేచి ఉండండి మేము అతి త్వరలో అప్‌డేట్‌లతో వస్తాము.. నన్ను నమ్మండి’ అంటూ ట్వీట్ చేసింది. కాగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా దీనిపై స్పందించిన చిత్ర బృందం ఏ విషయాన్ని అయినా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాము. రూమర్స్ నమ్మకండి అంటూ నోట్ షేర్ చేశారు.

Tags:    

Similar News