Keerthy Suresh: పసుపు తాడుతో ప్రమోషన్స్.. ఎమోషన్స్ టూ డెడికేషన్స్ అంటున్న ఫ్యాన్స్

హీరోయిన్ కీర్తీ సురేష్ (Keerthy Suresh) రీసెంట్‌గా వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-12-19 12:14 GMT

దిశ, సినిమా: హీరోయిన్ కీర్తీ సురేష్ (Keerthy Suresh) రీసెంట్‌గా వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని‌ (Antony)తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. రీసెంట్‌గా గోవాలో పెళ్లి (marriage) చేసుకుంది. అయితే.. వీరి పెళ్లి జరిగి 10 రోజులు కూడా కాకముందే కీర్తి సురేష్ సినిమా ప్రమోషన్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. వరుణ్ ధావన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కలీస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ (Promotions)లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ముంబై (Mumbai)లో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్‌కు హీరోయిన్ పసుపు తాడు మెడలో వేసుకుని దర్శనమిచ్చింది. దీంతో ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంపై ఎనలేని గౌరవం.. అలాగే వర్క్‌పై కీర్తీ సురేష్‌కున్న డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. దీంతో కీర్తిపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.


Similar News