Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. ఇంట్రెస్టింగ్‌గా పోస్టర్
‘క’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ప్రజెంట్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.
దిశ, సినిమా: ‘క’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. ప్రజెంట్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు. విశ్వ కరుణ్ (Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ‘దిల్ రూబా’ (Dil Ruba) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివమ్ సెల్యులాయిడ్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
టైటిల్ రిలీజ్ (Title Release) సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నారు. అలాగూ ‘హిస్ లవ్.. హిస్ యాంగర్..’ అనే కొటేషన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్‌ను రిఫ్లెక్ట్ చేస్తోంది. లవ్ (love), రొమాంటిక్ (romantic) యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ‘దిల్ రూబా’ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ‘క’ లాగే ఇది కూడా బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్ అందుకుంటుందని దీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.
ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) December 19, 2024
His love ❤️ His anger🔥
DILRUBA - Feb 2025 #Sivamcelluloids #Saregama #Yoodlefilms #Dilruba #KA10 pic.twitter.com/Az7ZlhcLHT