Pushpa-2: ‘పుష్ప-2’ నుంచి కిసిక్ ఫుల్ సాంగ్.. డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న బన్నీ, శ్రీలీల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన ‘పుష్ప-2’

Update: 2024-12-19 15:48 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన ‘పుష్ప-2’ (Pushpa-2) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్ (Positive Talk) సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుండగా మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్‌ (Full Video Songs)లను ఒక్కోక్కటిగా వదులుతున్నారు. ఇందులో భాగంగా.. సినిమాలో సూపర్ హిట్‌ (Super Hit)గా నలిచిన కిసిక్ (Kissik) సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) స్టెప్పులకు కుర్రాళ్ల మెస్మరైజ్ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్, శ్రీలీల కాంబోకి ఫ్యాన్స్ ఫిదా కావడంతో.. రిలీజ్ చేసిన కొద్ది సేపటికే సాంగ్ ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతుంది.

Full View

Read More...



Tags:    

Similar News