Balakrishna: డాకు మహారాజ్ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్.. క్యూట్‌గా వైరల్ అవుతున్న పోస్టర్

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తాజా ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’ (Daku Maharaj).

Update: 2024-12-19 13:48 GMT

దిశ, సినిమా: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తాజా ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌తో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘డాకు మహారాజ్’ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఇందులో నుంచి ఫస్ట్ సింగిల్ (First Single) ‘ది రేజ్ ఆఫ్ డాకు’ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా సెకండ్ సింగిల్ (Second Single) అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘సున్నితమైన గాలి.. ఆ గాలిలో ఇంద్రజాలాన్ని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి! డాకు మహారాజ్ నుంచి 2వ సింగిల్ ‘చిన్ని’ డిసెంబర్ 23న విడుదల కాబోతుంది’ అని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య బాబుతో పాటు ఓ చిన్ని పాప కూడా ఉంది. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News