Winter: రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి పులి.. నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా (Cold waves) చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ (Meteorological Department) కీలక అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్,ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాలకు (Orange) ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
ఈ జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హన్మకొండ, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో(yellow) అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు పేర్కొంది.