TG Assembly: సభలో భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్ అంటూ తడబడ్డ హరీశ్ రావు హాట్ కామెంట్స్

అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్ అంటూ తడబడ్డారు.

Update: 2024-12-17 06:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డిప్యూటీ స్పీకర్ అంటూ తడబడ్డారు. వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ రియాక్ట్ అయ్యి.. డిప్యూటీ సీఎం అని హరీశ్ రావుకి గుర్తుచేశారు. సారీ.. అంటూ హరీశ్ రావు మాట్లాడుతూ.. భవిష్యత్తులో భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సీఎం అవుతారేమో.. మంచిదే కదా.. (CM) సీఎం కావాలని కోరుకుంటున్నాము.. అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో సభ్యులంతా సరదాగా నవ్వుకున్నారు. తెలంగాణ శాసనసభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట, వికారాబాద్, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News