Kavitha: కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీపై కవిత సంచలన వ్యాఖ్యలు

డీపీఆర్ లేకుండా రేవంత్ రెడ్డి నిధులెలా అడిగారని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-17 09:24 GMT

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యరో: మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ ప్రకటన సభను తప్పుదారి పట్టించేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఆరోపించారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడిన ఆమె మూసీ నది (Moosi Project) విషయంలో డీపీఆర్ (DPR) ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. డీపీఆర్ ఇంకా తయారు కాలేదని ఈ రోజు సభకు వెల్లడించింది. కానీ ఇదే మూసీ ప్రాజెక్టు కోసం రూ.4,100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం మాకు ఉందని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించిందన్నారు. డీపీఆర్ లే సిద్ధం కానప్పుడు మూసీ కోసం రూ .14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని ఏ ప్రాతిపదికన అడిగారని ప్రశ్నించారు. ఒక వేళ కేంద్రాన్ని సహాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సహాయం కోరడం వాస్తవమైతే డీపీఆర్ ఇంకా సిద్ధం కాలేదని సభను, ప్రజలను ఎందుకు తప్పు దోవ పట్టిస్తున్నారని నిలదీశారు. సభను తప్పుదోవ పట్టిస్తే అవసరమైతే ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడుతామన్నారు.

వారి ఈఎంఐలు ప్రభుత్వం చెల్లిస్తుందా?:

మూసీ నది గర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతుంటే వాస్తవంగా పరిస్థితి మరోలా ఉందని, హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవసస్తవమని స్పష్టమవుతోందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నామని ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే వాటిని సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 181 కుటుంబాలు తమంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోందని ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉందన్నారు. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని కూలగొట్టిన ఇళ్లకు ఈఎంఐలు ఉంటే వాటిని ప్రభుత్వం చెల్లిస్తుందా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News