BRS:పాఠాలు వినాల్సిన పిల్లలు.. ఆసుపత్రుల పడకలపైకి.. మాజీమంత్రి హరీష్ రావు

విద్యార్థినికి అన్ని సార్లు ఎలుకలు కొరికితే అధికారులు(Authorities) ఏం చేసున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) మండిపడ్డారు.

Update: 2024-12-17 09:06 GMT

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థినికి అన్ని సార్లు ఎలుకలు కొరికితే అధికారులు(Authorities) ఏం చేసున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS leader Harish Rao) మండిపడ్డారు. ఖమ్మం జిల్లా(Khammam District) దానవాయిగూడెంలో(Danavaygudem) జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో(BC Welfare Hostel) చదువుతున్న విద్యార్థినిని ప్రాణాల మీదికి తెచ్చిందని ఆరోపించారు. మార్చి నుంచి నవంబర్ వరకు లక్ష్మీ భవానీ కీర్తి(Lakshmi Bhavani Keerti) అనే విద్యార్థిని 15 సార్లు ఎలుకలు కొరికితే అధికారులు ఏం చేసున్నట్లు అని ప్రశ్నించారు. అనేక సార్లు ఆసుపత్రికి వచ్చినా ఎందుకు సరైన వైద్యం అందించలేదని, తీవ్ర అనారోగ్యం పాలై మంచం పడితే అధికారులు ఏం చేస్తున్నట్లు? అని నిలదీశారు.

ఇది అత్యంత అమానవీయ ఘటన అని, అనేకసార్లు రాబిస్ వ్యాక్సిన్(Rabies Vaccine) ఇవ్వడం వల్ల కాళ్లు చచ్చు పడిపోయిన దారుణమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక గురుకులాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, గురుకుల బాట పేరుతో ఒక్కరోజు ప్రచారం చేసి చేతులు దులుపుకున్నారని, కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు వినాల్సిన పిల్లలు, అనారోగ్యంతో ఆసుపత్రి పడకలపైకి చేరుతుండడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తీవ్రంగా అనారోగ్యం పాలైన లక్ష్మీ భవానీ కీర్తిని నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎలుకలు కొరికిన ఇతర విద్యార్థుల ఆరోగ్యాలు సంరక్షించాలని, మంచి వైద్యం అందించాలని హరీష్ రావు కోరారు.

Tags:    

Similar News