Manchu Nirmala: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్.. మనోజ్ తల్లి సంచలన లేఖ విడుదల
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో తలెత్తిన వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీ (Manchu Family)లో తలెత్తిన వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే జర్నలిస్టు (Journalist)పై దాడి కేసులో ఇప్పటికే నటుడు మోహన్ బాబు (Mohanbabu)పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా, మోహన్ బాబు సతీమణి నిర్మల (Nirmala) పహాడీ షరీఫ్ (Pahadi Sharif) ఎస్‌హెచ్‌వో (SHO)కు రాసిన లేఖ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. అయితే, ఆ లేఖలో ఆమె చిన్న కొడుకు మనోజ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
తన బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు జల్‌పల్లిలోని ఇంటికి పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకువచ్చాడని తెలిపారు. అయితే, అది నచ్చని మనోజ్ (Manoj) కావాలనే సీసీ టీవీ ఫుటేజ్ (CCTV Footage)ని బయటపెట్టి విష్ణు (Vishnu)పై లేనిపోని అభాండాలు వేశాడని ఆరోపించారు. అనంతరం అతడే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని లేఖలో పేర్కొన్నారు. తన పెద్ద కొడుకు విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, తన మనుషులతో కలిసి గొడవకు దిగలేదని తెలిపారు. విష్ణు (Vishnu)పై మనోజ్ (Manoj) ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు. జరిగిన గొడవల కారణంగా ఇంట్లో పని చేసేవాళ్లంతా పని మానేసి వెళ్లిపోయారని.. ఆ విషయంలో కూడా విష్ణు ప్రమేయం లేదని నిర్మల తన లేఖలో పేర్కొన్నారు.