Naga Chaitanya: ఈ సారైనా నాగచైతన్యకు ఆ రెండు అక్షరాలు కలిసొచ్చేనా? నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన వార్త
సామ్, చై కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు
దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య ( Naga Chaitanya ) , శోభిత ( Sobhita Dhulipala)పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా నాగచైతన్య , శోభిత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వీరి ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. రెండేళ్ల పాటు నుంచి ప్రేమించుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
అయితే, ఇప్పుడు నెట్టింట ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. నాగ చైతన్య మొదటి భార్య పేరు " స "తో మొదలయ్యి " త "తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు రెండో భార్య పేరు కూడా "స "తో మొదలయ్యి " త " తోనే ఎండ్ అయింది. అప్పుడు సామ్, చై కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత ఇద్దరికీ మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం వలన విడాకులు తీసుకుని విడిపోయారు. తాజాగా చైతూ, శోభిత కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మరి , ఈ సారైనా నాగచైతన్యకు ఈ రెండు అక్షరాలు కలిసొస్తాయా? లేక ఏమైనా జరుగుతుందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.