‘స్పెర్మ్‌తో ఫేషియల్ చేయించుకుంటాను’.. ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి?

కొంతమంది ఆడవాళ్లు అందానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-12-17 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది ఆడవాళ్లు అందానికి ఎంత ప్రియారిటీ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఫేస్‌పై చిన్న పింపుల్ రాగానే తెగ కంగారుపడిపోతుంటారు. మొటిమలు(pimples) తొలిగించేందుకు పలు ప్రొడక్ట్స్ లేదా ఇంట్లోనే చిట్కాలు ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా ఫేస్ గ్లో కోసం మంత్లీ మంత్లీ ఫేషియల్స్(Facials) కూడా చేయించుకుంటారు. ఇక పెళ్లిళ్లు, పేరంటాలకు.. పలు ఈవెంట్లకైతే లిప్ స్టిక్(Lipstick) లేనిదే బయటకెళ్లరు. ఇక ఇండస్ట్రీ నటీమణులు (Industry actresses) వాడే కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి తెలిసిందే.

అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిమ్ కర్ధాషియాన్(Kim Kardashian) అనే ఓ హాలీవుడ్(Hollywood) నటి.. తన బ్యూటీ సీక్రెట్ ఏంటో బయటపెట్టి అందరినీ షాకింగ్‌కు గురి చేసింది. ఈ నటి స్పెర్మ్‌తో షేషియల్ చేయించుకుంటుందట. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవ్వగా.. స్పెర్మ్‌తో ఫేషియల్ చేయించుకుంటానని.. కానీ అది ప్రత్యేకంగా పెంచిన సాల్మన్ చేపల(salmon fish) నుంచి సేకరించిన వీర్యం(sperm)తో చేయించుకుంటానని నటి వెల్లడించినట్లు టాక్. ఈ సాల్మన్ ఫిష్ వీర్యం కేవలం ఫేషియల్ కోసమే కాదు.. రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం కూడా వాడుతారని వార్తల్లో వింటూనే ఉంటాం.

అయితే సాల్మన్ చేపల స్మెర్మ్‌లో ఉండే పాలీడియోక్సిరిబోన్యూక్లియోటైడ్స్ (Polydeoxyribonucleotides) అనే పదార్థంతో ఈ ఫేషియల్ రెడీ చేస్తారట. ఈ ఫేషియల్‌ను ఇండియాలో కొంతమంది మాత్రమే ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఈ ఫేషియల్ మొత్తం మూడు రకాలు ఉంటుంది. ఒకటి టాపికల్ అప్లికేషన్(Topical application). దీనికోసం రూ.15 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. రెండోవది మైక్రోనీడిండ్(Microneedind). ఈ ఫేషియల్ కోసం 40 వేల రూపాయలు ఛార్ట్ చేస్తారు. అలాగే మూడోది స్మెర్మ్‌లోని డీఎన్‌ఏ(DNA)ను ఇన్జెక్ట్ చేస్తారట. ఇందుకు 80 వేల రూపాయలు అవుతుందట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News