KTR: ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో A1 గా కేటీఆర్!
తెలంగాణ పాలిటిక్స్‌లో ఫార్ములా -ఈ కార్ రేసు వ్యవహారం కలకలం రేపుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో/సిటీ క్రైం: తెలంగాణ పాలిటిక్స్‌లో ఫార్ములా -ఈ కార్ రేసు (Formula-E Car) వ్యవహారం కలకలం రేపుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పై కేసుకు రంగం సిద్ధం అవుతున్నది. ఆయనపై కేసుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో ఎఫ్ఐఆర్ నమోదుకు ఏసీబీ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ-1 గా కేటీఆర్, ఏ-2గా పురపాలక శాఖ అప్పటి స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ (IAS Aravind Kumar) పేరును చేర్చబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఏసీబీ (ఏసీబీ) స్పీడ్ పెంచబోతున్న నేపథ్యంలో ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఏ క్షణంలో ఏం జరగబోతున్నదనే దానిపై ఇటు బీఆర్ఎస్‌లో అటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠగా మారింది.
అసెంబ్లీ సెషన్స్ తర్వాత రంగంలోకి..
నిన్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్‌పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏడాది పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న తరుణంలో కేటీఆర్ అరెస్టు చేస్తే ఎలాంటి పరిణామాలు జరుతాయనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఏసీబీ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నదని పక్కాగా అన్ని అనుమతులు, ప్రొసీజర్స్‌తో కేటీఆర్ అరెస్టు ఉండబోతున్నదనే చర్చ వినిపిస్తోంది.
తండ్రి, కొడుకులకు వ్యూహాత్మకంగా చెక్..
గత ప్రభుత్వ నిర్ణయాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో తప్పిదాలపై జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికతో పాటు ఫార్ములా -ఈ కార్ రేసు అంశంలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని ఒకే రోజు నిర్ణయించడం ఆసక్తిగా మారింది. అలాగే విద్యుత్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రస్తుత సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తోంది. ఇక ఈ అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌పై తీసుకునే యాక్షన్‌పై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.