Harish Rao: హరీష్‌రావు లేఖకు స్పందించిన ప్రభుత్వం.. నేటి నుంచి గోదావరి జలాల ఎత్తిపోత

సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నీళ్లు లేక ఎడారులను తలపిస్తున్నాయని ఇటీవలే మాజీ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు.

Update: 2024-08-05 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నీళ్లు లేక ఎడారులను తలపిస్తున్నాయని ఇటీవలే మాజీ మంత్రి హరీష్‌రావు ఇటీవలే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు సతమతం అవుతున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానెర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని హరీష్ రావు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. అందుకు స్పందించిన ప్రభుత్వం మిడ్‌ మానేర్ ద్వారా గోదావరి జలాలను పంపింగ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రకటించారు.

Tags:    

Similar News