Harish Rao : విజయోత్సవాల సమయంలో ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంటి? హరీశ్ రావు ఫైర్

ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అని మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు.

Update: 2024-12-01 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే (Fake encounter) ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్‌కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆరోపించారు.

అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని, ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజవంతంగా తూట్లు పొడిచారని విమర్శించారు. బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లు అంటూ ఫైర్ అయ్యారు. (Mulugu District) ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

 

Tags:    

Similar News