అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. కెమెరాలో చూయించాలంటూ హరీష్ రావు రిక్వెస్ట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలే హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ అంశంపై చర్చిస్తు్న్న ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అసలు నన్ను కెమెరాలో చూపించరా అని స్పీకర్‌ను అడిగారు. మా ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. నేను మాట్లాడుతుంటే.. నన్ను తప్ప అందర్నీ ఎలా చూపిస్తారన్నారు. ముఖాలు కూడా చూపించకుండా చేయడం అన్యాయమన్నారు. ఈ అంశంపై రియాక్ట్ అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అలా ఏమీ లేదు.. అందర్నీ చూపిస్తామని భరోసా ఇచ్చారు.