ధమ్మ విజయం వేడుకల్లో పాల్గొన్న గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో ధమ్మ విజయం వేడుకలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Update: 2024-10-14 14:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్వర్యంలో నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో ధమ్మ విజయం వేడుకలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బౌద్ధం అనగానే మనకు గౌతమ బుద్ధుడు ఆయన బోధనలు గుర్తుకొస్తాయన్నారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి ఆయన బోధనలు చేసారని ఆయన చెప్పారు. అంతటి మహనీయులని ఆదర్శంగా తీసుకొని బౌద్ధంపట్ల ఆకర్షితుడైన చక్రవర్తి అశోకుడు కళింగ యుద్ధం వలన జరిగిన అపార ప్రాణ నష్టం పట్ల చలించి, యుద్ధాల వల్ల సమకూరే దిగ్విజయాల కన్నా బుద్ధుని దమ్మ బోధనల వల్ల కలిగే దమ్మ విజయం మేలని విజయదశమి రోజున అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భాన్ని ఆయన వివరించారు. దసరా సందర్భంగా ధమ్మ విజయం వేడుకలను నిర్వహించడం ద్వారా నేటి యువతకు చరిత్ర గురించి తెలుస్తోందని తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి దేశ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసారని చెప్పారు. ఇంతటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ వేడుకలలో స్థానిక సంస్థల ఎం.ఎల్.సి.మంకెన కోటి రెడ్డి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వెన్.ధర్మ రక్షిత, చైర్మన్-మోక్షనంద బుద్ధ విహార, టూరిజం కార్పొరేషన్ ఎం.డి. ప్రకాష్ రెడ్డి,IPS, పి. యెస్.ఎన్.మూర్తి, అడ్వైసర్ లత రాజా ఫౌండేషన్, సబ్ కలెక్టర్ మిర్యాలగూడ, బుద్దవనం ప్రాజెక్ట్ ఓ.యెస్. డి. సుధన్ రెడ్డి మరియు వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.


Similar News