Group-2 Hall Tickets: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణాలో 783 గ్రూప్-2(Group-2) పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఈ నెల(డిసెంబర్) 15,16 వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-09 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణాలో 783 గ్రూప్-2(Group-2) పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఈ నెల(డిసెంబర్) 15,16వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు(Hall Tickets) ఈ రోజు విడుదలయ్యాయి. గ్రూప్-2 హాల్ టికెట్లు ఈ రోజు నుంచి 15వ తేదీ మార్నింగ్ 9 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంటాయి. అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా గ్రూప్-2 ఎగ్జామ్స్ మొత్తం నాలుగు పేపర్లలో నిర్వహించనున్నారు. పేపర్-1 డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు. ఇక పేపర్-3 డిసెంబర్ 16న మార్నింగ్ 10-12.30 వరకు, పేపర్-4 మధ్యాహ్నం 3-5.30 వరకు ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు క్లోజ్(Gates Close) చేస్తామని, అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముగింపు సమయంలోగా చేరుకోవాలని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్(Naveen Nicholas) పేర్కొన్నారు. సెషన్-1 పరీక్షకు 9.30 గంటలు, సెషన్-2 పరీక్షకు మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అభ్యర్థులెవరనీ ఎగ్జామ్ సెంటర్(Exam Center)లోకి అనుమతించబోమని సృష్టం చేశారు.  

Tags:    

Similar News