Group-1: సీఎం రేవంత్ రెడ్డిపై మోడీకి ఫిర్యాదు చేసిన గ్రూప్ 1 అభ్యర్థులు

తెలంగాణలోని గ్రూప్-1 అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-16 07:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని గ్రూప్-1 అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార దుర్వనియోగం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షపై వేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో గ్రూప్-1 పరీక్షలు యధావిధిగా జరగనున్నాయి. అయితే దీనిపై గ్రూప్ అభ్యర్ధులు తెలంగాణలో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, మీరు జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో 29 జీవో తీసుకురావడం వల్ల రాజ్యంగ ఉల్లంఘన జరిగిందని, దీనితో గ్రూప్-1 లో ఎస్సీల రిజర్వేషన్లు ప్రభుత్వం తొలగించిందని, మహిళా రిజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. అలాగే అక్రమ చర్యల ద్వారా అనేకమంది స్థానికేతర విద్యార్థులను పరీక్షలకు ఆహ్వానించారని, న్యాయమూర్తి పుల్లా కార్తిక్ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై తీర్పును మార్చారని, ఇలాంటి ఎన్నో సంఘటనలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజ్యాంగ విరుద్దంగా ఎస్టీల రిజర్వేషన్లు 6 శాతం నుండి 10 శాతానికి పెంచారని చెప్పారు. ఇదిలా ఉండగా.. అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ నేతలు నిలవకపోవడం షాక్ కు గురిచేసిందని గ్రూప్ 1 ఆశావాహులు మెయిల్ లో రాసుకొచ్చారు. 



 



 



Similar News