తెలంగాణలో బీసీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణలో బీసీ విద్యార్థుల(BC Students)కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Update: 2024-10-07 14:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో బీసీ విద్యార్థుల(BC Students)కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సోమవారం స్కాలర్‌షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. మొత్తం రూ.1505 కోట్లను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 2024–25 ఆర్ధిక సంవత్సరం కింద ఈ స్కీమ్‌కు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. కాగా, అంతకుముందు బీసీ సంక్షేమ శాఖపై సచివాలయం వేదికగా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో హాస్టల్, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ ఉద్యోగులు, అధికారులంతా బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడే విధంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.


Similar News