Harish Rao : ప్రభుత్వ విధానాలతో స్థానిక విద్యార్ధులకు నష్టం : హరీష్ రావు
ఎంబీబీఎస్ అడ్మిషన్ల(MBBS Admissions)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)అనుసరించిన తప్పుడు నియమాలతో వందల మంది స్థానిక అభ్యర్థులకు నష్టం జరిగిందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఎంబీబీఎస్ అడ్మిషన్ల(MBBS Admissions)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)అనుసరించిన తప్పుడు నియమాలతో వందల మంది స్థానిక అభ్యర్థులకు నష్టం జరిగిందని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన లోకల్ కోటా నియమాలను ఇప్పుడు హైకోర్టు రద్దు చేసిందని, అడ్మిషన్లలో స్థానిక విద్యార్థులకు జరిగిన నష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. మేము ఆనాడే చెప్పామని..మెడికల్ అడ్మిషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం లోకల్ కోటా నిబంధనలు స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తాయని హరీష్ రావు గుర్తు చేశారు.
కాగా ఎంబీబీఎస్ అడ్మిషన్లలో స్థానిక కోటా నియమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేసినా ప్రభుత్వం ఈ విషయంలో వెనుకడుగు వేయలేదు. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ వైఖరి తప్పని తేలిందని బీఆర్ఎస్ విమర్శలకు పదును పెట్టింది.