సమర్థుడికి బాధ్యతలు అప్పగించాలని CM నిర్ణయం.. పరిశీలనలో వారి పేర్లు!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించేందుకు ప్రభుత్వం కరసత్తు చేస్తున్నది. అందుకోసం పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లతోపాటు సర్వీసులో ఉన్న ఐఏఎస్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Update: 2024-09-10 02:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమించేందుకు ప్రభుత్వం కరసత్తు చేస్తున్నది. అందుకోసం పలువురు రిటైర్డ్ ఐఏఎస్‌లతోపాటు సర్వీసులో ఉన్న ఐఏఎస్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వివాదరహితుడు, సమర్థుడైన బ్యూరోక్రట్‌కు కమిషన్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇంతకాలం కమిషనర్ గా పనిచేసిన పార్థసారధి పదవీ కాలం రెండు రోజుల క్రితం ముగియడంతో కొత్త కమిషనర్ ఎంపిక అనివార్యమైంది.

బ్యూరోక్రట్స్ మధ్య తీవ్ర పోటీ

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవి కోసం బ్యూరోక్రట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఒకసారి అపాయింట్ అయితే ఐదేళ్లపాటు ఆ పదవిలో ఉండవచ్చు. దీంతో రిటైర్డ్, సర్వీసులో ఉన్న ఐఏఎస్‌లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మరో ఏడాది, ఏడాదిన్నరలో రిటైర్డ్ కానున్న ఆఫీసర్లు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం తమకు ఉన్న లాబీయింగ్ మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్ లు ఏకంగా డిల్లీ కాంగ్రెస్ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సమర్థుడైన బ్యూరోక్రట్ కు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు.


రాజకీయాలకు అతీతంతా వ్యవహరించే ఆఫీసర్‌ను అపాయింట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ఈ మధ్యే పదవీ కాలం ముగిసిన పార్థసారధి నాలుగేళ్లు మాత్రమే కమిషనర్ గా పనిచేశారు. మరో ఏడాదిపాటు ఆయన పనిచేసే అవకాశం ఉండటంతో ఆయన తన పదవీకాలాన్ని పొడిగించుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే సీఎం రేవంత్ మాత్రం కొత్త వ్యక్తిని అపాయింట్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రిటైర్డ్ అయిన ఐఏఎస్ లు సురేశ్ చందా, సునీల్ శర్మ, హరిప్రీత్ సింగ్, అదర్ సిన్హా, అరవిందర్ సింగ్, విజయ్ కుమార్, రాణికుముదిని సైతం ఈ పోస్టు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.


Similar News