GOOD NEWS: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. జులై నెలలో భారీగా సెలవులు

గత నెల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి.

Update: 2024-07-07 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత నెల రెండు తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా మళ్లీ స్కూళ్ల బాట పట్టి దాదాపు నెల గడుస్తోంది. పాఠశాలలతో పాటు ఇంటర్ కళాశాలలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, కోర్సుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇక పిల్లలకు హాలీడేస్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాగా స్కూలు ఆరంభం రోజే ఈ ఏడాది పాఠశాలలకు ఎన్ని సెలవులు ఉన్నాయని ముందుగానే కాలెండర్‌లో చూసుకునే విద్యార్థులున్నారు. మరీ జులై నెలలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు, కళాశాలలకు భారీగానే సెలవులు వస్తున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ హాలీడేస్ ఏయే తేదీల్లో హాలీడేస్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం.. ముందుగా నేడు జులై 7 వ తేదీన- ఆదివారం హాలీడే వస్తుంది. 13 వ తారీకు రెండో శనివారం. మళ్లీ 14 న ఆదివారం వస్తుంది. ఈ రెండ్రోజులు పాఠశాలలు బంద్ కానున్నాయి. ఇక జులై 21, 28 ఆదివారాలు. జులై 27న బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. జులై 17 వ తేదీన (బుధవారం రోజు) మొహర్రం రోజున కూడా పాఠశాలలకు హాలీడే రానుంది. ఇలా సాధారణ సెలవులతో కలుపుకుని మొత్తంగా ఈ నెల మొత్తం 7 రోజులు హాలీడేస్ వస్తున్నాయి.

జులై నెలలో సెలవులు..!

జులై - 7  వ తేది: ఆదివారం

జులై -13 వ తేది: రెండో శనివారం

జులై - 14 వ తేది : ఆదివారం

జులై  -17  వ తేది: మొహర్రం

జులై - 21 వ తేది: ఆదివారం

జులై - 27  వ తేది: బోనాల పండుగ

జులై - 28  వ తేది : ఆదివారం


Similar News