రైతులకు గుడ్ న్యూస్.. ఉచిత పంట బీమా ఎప్పటినుంచంటే..!

రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం (క్రాప్‌ ఇన్సూరెన్స్‌) పథకం అమలుపై కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Update: 2024-06-08 04:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం (క్రాప్‌ ఇన్సూరెన్స్‌) పథకం అమలుపై కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ సర్కారు ‘పీఎం- ఎఫ్‌బీవై’ పథకంలో చేరటంతో పాటు.. పశ్చిమబెంగాల్‌ తర హాలో రైతుల ప్రీమియాన్ని భరించాలని నిర్ణయించింది.

రాష్ట్ర సబ్సిడీతోపాటు రైతుల తరఫున ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే తెలిపారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్ర ధానమంత్రి ఫసల్‌ బీమా యోజన బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా ఉందని, రైతులకు ఉపయోగకరం గా లేదని గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం దాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విపత్తులు సంభవిస్తే అన్నదా తలు నష్టపోతున్నందున ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కొత్త బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

మూడేళ్లు నష్టపోయిన రైతులు

ప్రధాన మంత్రి ఫసల్‌‌ బీమా యోజన 2019–20 వరకు రాష్ట్రంలో కొనసాగింది. కానీ 2020లో ఈ పథకం నుంచి రాష్ట్రం తప్పుకుంది. అప్పటి నుంచి పంటల బీమా పథకం లేకపోవడంతో విపత్తుల వల్ల పంట నష్టపోయినా రైతులు ఎలాంటి బీమా పొందలేకపోయారు. 2020–21 రెండు సీజన్లలో 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. 2021–22లో దాదాపు 12 లక్షల ఎకరాలు, 2022–23లో మా ర్చి, ఏప్రిల్‌‌లో వర్షాలకు 2.30 లక్షల ఎకరాల్లో న ష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.230 కోట్లు పరిహారంగా గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభు త్వం ప్రకటించింది. గత డిసెంబర్‌‌లో రాష్ట్రంలో తుఫాన్‌‌ కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు.

ఫసల్ బీమాపై అధ్యయనం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫస ల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చె ల్లింపులు, బీమా పరిహారం వంటి అంశాలపై అధికా ర యంత్రంగం అధ్యయనం మొదలుపెట్టింది. పంట బీమా పథకం పక్క రాష్ట్రాల్లో ఎలా అమలవుతోందని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి ఏటా రూ.3 వేల కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల విస్తీర్ణంలో వ్యవ సాయ భూమి ఉంది. ఇందులో మొత్తం సాగవటం లేదు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌లో 1.30 కోట్ల ఎక రాలు, 2022-23లో 1.36 కోట్ల ఎకరాలు, 2023-24లో 1.26 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వ్యవ సాయ పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వచ్చే ఖరీ ఫ్‌లోనూ 1.30 నుంచి 1.35 కోట్ల ఎకరాలు పైగా పంటల బీమా ప్రీమియం నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

1.45 కోట్ల ఎకరాల్లో పంటల సాగు

ఈ పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్‌ బుకింగ్‌ యాప్‌లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తిస్తుంది. సుమారు 1.35 కోట్ల ఎకరాల నుంచి 1.45 కోట్ల ఎకరాల వి స్తీర్ణంలో వాన కాలం పంటలు సాగయ్యే అవకాశా లు ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకం అమ లు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందు కు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏఈవోల స్థాయి నుంచి ఏవోఏ లు, ఏడీఏలు, డీఏవోలు, సీపీవోలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగుతున్నాయి.

క్రాప్ బుకింగ్ కీలకం

రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పోర్టల్‌ను ఇప్పటికే పకడ్బందీగా అమలు చేస్తోంది. మండలాలను క్లస్టర్లుగా విభజించి ఏఈవోలతో క్రాప్ బుకింగ్ పక్రియను పక్కాగా చేయిస్తున్నారు. ఏ సర్వే నెంబర్? ఆ ఏ పంట ఎక్కడ వేశారు? పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, రైతుల పేర్లు ఇతర వివరాలు నమోదు చేస్తున్నారు. వాన కాలం, యాసంగి సీజన్లు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పంటల సాగు ముగిసే చివరి రోజు వరకు క్రాప్ బుకింగ్ చేయించడం ఒక ప్రక్రియ. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి ఏఈవో తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు.

పంటలపై రైతుల నుంచి డిక్లరేషన్

ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో నమోదైన విస్తీర్ణాన్నే పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఏ పంటలు వేశారో నిర్ధారించుకోవటానికి మాత్రం రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకుంటే మేలు అనే అభిప్రాయానికి వచ్చింది. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా వాస్తవ పంట నష్టం లెక్కించేందుకు వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో చట్టం ప్రవేశపెట్టి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.


Similar News