ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం గోడ వివాదంపై జీహెచ్ఎంసీ వివరణ

ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం చుట్టు గోడ కట్టడం కేవలం అభివృద్ధిలో భాగంగా చేపడుతున్నదేనని జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది.

Update: 2024-10-23 11:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం చుట్టు గోడ కట్టడం కేవలం అభివృద్ధిలో భాగంగా చేపడుతున్నదేనని జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడపై మండిపడ్డ దళిత సంఘాల నాయకులు అర్ధరాత్రి పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. గోడను కూల్చివేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలకు దూరం చేసేందుకే గోడ కడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేశాయి. జయంతి, వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు, ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయడానికి వీలు లేకుండా గోడ నిర్మాణం చేస్తున్నారని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడుతూ గోడను కూల్చాయి.

ఈ వివాదంపై స్పందించిన జీహెచ్ఎంసీ నగరంలోని వివిధ కూడళ్లలో ఉన్న జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నామని, దానిలో భాగంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేసింది. పార్లమెంట్ నమూనాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ అభివృద్ధి పనులను చేపట్టామని జీహెచ్ఎంసీ పేర్కొంది. సంబంధిత అభివృద్ధి నమూనా ఫోటోలను విడుదల చేసింది.


Similar News