బీఆర్ఎస్‌కు GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి రాజీనామా
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హైదరాబాద్‌లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ గూటికి చేరిపోగా.. తాజాగా మరొక కీలక నేత రాజీనామా చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. హైదరాబాద్‌లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార కాంగ్రెస్ గూటికి చేరిపోగా.. తాజాగా మరొక కీలక నేత రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. శనివారం తన ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు అధికారికంగ ప్రకటించారు. శ్రీలతతో మరో ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు రేపు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టలీలో ఉద్యమకారులకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వారు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.