New Year Effect: హైదరాబాద్‌లోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లపై పోలీసుల ఫోకస్‌

న్యూ ఇయర్(New Year) వేడుకల వేళ హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు(Hyderabad Police) పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-12-28 15:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్(New Year) వేడుకల వేళ హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు(Hyderabad Police) పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం బంజారాహిల్స్‌, ఉప్పల్‌, రాజేంద్రనగర్‌, గచ్చబౌలి, రాయదుర్గం, నార్సింగి, ఫిల్మ్‌నగర్‌, సరూర్‌నగర్‌ పబ్‌లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

వేడుకల పేరుతో డ్రగ్స్‌ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్‌ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్‌టేకింగ్ పోలీసులు తీసుకున్నారు. ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డ్రగ్స్‌ విక్రయాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేశారు. పాత నేరస్తులపై నిఘా పెట్టారు.

Tags:    

Similar News